హైదరాబాద్: 28°C
వార్తలు

మేం భారతీయులం: చిన్నారి వీడియో వైరల్

అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు చెందిన ఓ చిన్నారికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తమను చైనీస్ అని పిలవొద్దని ఆ వీడియోలో కోరింది. మీరు చైనీయులా? అని ఒకరు ఆ చిన్నారిని ప్రశ్నించగా.. 'మేమూ భారతీయులమే.. మమ్మల్ని చైనీస్ అని పిలవకండి' అంటూ విజ్ఞప్తి చేసింది. తమను చైనీస్ అని పిలిస్తే కోపం వస్తుందని.. మమ్మల్ని ఇండియన్స్ అని పిలవాలని అభ్యర్థించింది.