హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ తెహల్కా ఎడిటర్

తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2013 అత్యాచారం కేసులో తనకు విధించిన 10 ఏళ్ల జైలు శిక్షను సవాల్ చేశారు. ఆగస్టు 6న తేజ్‌పాల్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన బాంబే హైకోర్టు గోవా బెంచ్ తీర్పునిచ్చింది. ఇప్పటికే తేజ్‌పాల్‌కు జీవిత ఖైదు విధించాలని గోవా ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.