హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీ ఆందోళనలు.. విచారణకు కమిటీ

జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళనల సమయంలో ఢిల్లీ పోలీసుల చర్యలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసుల తీరుపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణకు చెందిన జస్టిస్ ఆర్. సుభాష్‌ రెడ్డి నేతృత్వం వహించనున్నారు.