హైదరాబాద్: 28°C
వార్తలు

ఉరి తీర్పుల జడ్జికి భారీ ఝలక్

యూపీ ముజాఫర్ నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవికుమార్ దివాకర్‌కు షాక్ తగిలింది. గత నాలుగు నెలల్లో ఆయన 10 హత్య కేసుల్లో 22 మందికి మరణశిక్ష విధించారు. ఈ నేపథ్యంలో ఆయన వద్ద విచారణలో ఉన్న మరణ శిక్ష, జీవిత ఖైదు పడే అవకాశం ఉన్న సుమారు 100 హత్య కేసులను మరో కోర్టుకు బదిలీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.