ఢిల్లీ ప్రెస్ క్లబ్‌లో ప్రధాని మోదీ మద్దతుదారులు చేసిన ఓ కార్యక్రమం చర్చనీయాంశమైంది. మోదీని దేవుడిగా కీర్తిస్తూ ఏకంగా ఆయన విగ్రహానికి హారతులు పట్టారు. అంతేకాకుండా మోదీ చాలీసా పఠించారు. శ్రీరాముడి రూపంలో ఉన్న మోదీ విగ్రహం చుట్టూ కాషాయ వస్త్రాలు ధరించిన ఐదారుగురు వ్యక్తులు తిరుగుతూ జై జై మోదీ.. హర హర మోదీ అంటూ నినాదాలు చేస్తూ హారతులు పట్టారు.
వార్తలు
ప్రెస్ క్లబ్‌లో 'మోడీ చాలీసా' పఠనం


