హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో ఫేక్ సీబీఐ గ్యాంగ్ హల్‌చల్

ఢిల్లీ రోహిణి ప్రాంతంలో సీబీఐ పేరుతో 10 మంది ముఠా హల్‌చల్ చేశారు. ఓ వ్యాపారవేత్త ఇంట్లోకి చొరబడేందుకు ఈ ఫేక్ గ్యాంగ్ ప్రయత్నించింది. సీబీఐ లోగో ఉన్న డ్రెస్‌లు, ఐడీ కార్డులు చూపించి బరిడీ కొట్టించే యత్నం చేశారు. సెర్చ్ వారెంట్ చూపించాలంటూ వ్యాపారవేత్త భార్య గేటు తీసేందుకు నో చెప్పడంతో అసహనానికి గురయ్యారు.  ఇరుగుపొరుగు వారు గుమిగూడడంతో వెళ్లిపోయారు.