హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ నిర్ణయమే దేశ విభజనకు పునాది: అమిత్ షా

1937లో ముస్లింలను బుజ్జగించడం కోసం.. వందేమాతర గేయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెండుగా విడగొట్టి దేశ విభజనకు పునాది వేసిందని కేంద్రమంత్రి అమిత్ షా మండిపడ్డారు. నాటి నుంచే ద్విజాతి సిద్ధాంతం బలపడి.. చివరకు దేశ విభజన జరిగి పాక్ పురుడుపోసుకుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ చేసిన ఆ చారిత్రక తప్పిదాన్ని ఇప్పుడు మోదీ ప్రభుత్వం సరిదిద్దిందని చెప్పారు.