హైదరాబాద్: 28°C
వార్తలు

జెన్‌ జీ యువతి వివాదం.. వీకే సింగ్‌ ఏమన్నారంటే?

మినామార్గ్ చెక్‌పోస్టు వద్ద భద్రతా సిబ్బందితో జెన్ Zని అంటూ పర్యాటకురాలు వాగ్వాదానికి దిగిన ఘటనపై ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ VK సింగ్ స్పందించారు. భద్రతా సిబ్బందిపై విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. దేశానికి రక్షణ కవచంగా బలగాలు పనిచేస్తుంటే.. సైనికులను అన్యాయంగా నిందించడం సరికాదన్నారు. దేశం కోసం త్యాగాలు చేస్తున్న వారికి తాము అండగా ఉంటామని చెప్పారు.