హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షాలు.. సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తివేత

జమ్మూకశ్మీర్‌లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా రియాసిలోని సలాల్ డ్యామ్ పూర్తిగా నిండింది. దీంతో అధికారులు సలాల్ డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు యూపీలోనూ ప్రమాదకర స్థాయికి నదులు చేరుకున్నాయి. వారణాసి గంగానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో వరద నీరు నమో ఘాట్‌ను తాకాయి. అలాగే రామ్ గంగా 190 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది.