వందేమాతరం తొలి 2 చరణాలను మాత్రమే ఆలపించాలని నిర్ణయించిన కాంగ్రెస్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శలు గుప్పించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ కొత్త ముస్లిం లీగ్‌గా మారిందని ఆరోపించారు. వందేమాతరాన్ని అవమానించడం దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను అవమానించడంతో సమానమని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం దేశ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పదేపదే తాకట్టు పెడుతోందన్నారు.
వార్తలు
ఆ పార్టీ సరికొత్త ముస్లిం లీగ్: నితిన్ నబీన్


