హైదరాబాద్: 28°C
వార్తలు

ఏఈ నూకరాజు కుటుంబం కోసం గాలింపు

AP: రాజమండ్రిలోని గోదావరి నదిలో AE నూకరాజు కుటుంబ సభ్యుల కోసం నాలుగో రోజు గాలింపు కొనసాగుతోంది. నదిలో దూకి గల్లంతైన ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం రాత్రి ఈ కుటుంబం నదిలో దూకిన విషయం తెలిసిందే. రోడ్ కం రైల్వే బ్రిడ్జి నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకు గాలింపు చేపట్టారు. SDRF బృందాలు, అగ్నిమాపక, పోలీసు సిబ్బందితో పాటు డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారు.