హైదరాబాద్: 28°C
వార్తలు

RSS చీఫ్ కెనడా పర్యటనకు భారీ మద్దతు

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కెనడా పర్యటనకు మద్దతుగా 100కు పైగా సంస్థలు ముందుకొచ్చాయి. ఆయన పర్యటనను అడ్డుకోవాలన్న డిమాండ్లను తిరస్కరించాలని కెనడా ప్రధాని మార్క్ కార్నీకి లేఖ రాశాయి. భాగవత్‌పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, సరైన ఆధారాలు లేకుండా పర్యటనను అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేశాయి. కెనడాలోని లక్షలాది హిందువులకు ఈ పర్యటన ఎంతో ముఖ్యమని లేఖలో పేర్కొన్నాయి.