హైదరాబాద్: 28°C
వార్తలు

తెలంగాణ ఎంపీలతో ద.మ.రైల్వే సమావేశం

TG: రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు, క్షేత్రస్థాయి అంశాలపై చర్చించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. రైల్‌ నిలయంలో ఉ.10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరినీ ఆహ్వానించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు.