ఢిల్లీ ఎయిమ్స్ నుంచి కేంద్రమంత్రి జేపీ నడ్డా డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 13న స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఎయిమ్స్‌కు తరలించారు. పలు పరీక్షలు చేసిన అనంతరం నడ్డాకు ఈ నెల 17న యాంజియోప్లాస్టీని వైద్యులు పూర్తి చేశారు. డిశ్చార్జ్ అయిన అనంతరం తాను సంపూర్ణ ఆరోగ్యంతో, క్షేమంగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా తనకు వైద్యం అందించిన డాక్టర్లకు కృతజ్ఞతలు చెప్పారు.
వార్తలు
ఎయిమ్స్ నుంచి కేంద్రమంత్రి డిశ్చార్జ్


