ఓ మహిళా అధికారికి శాశ్వత కమిషన్ ఇవ్వకపోవడంపై భారత కోస్ట్ గార్డ్ (ICG)పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాశ్వత కమిషన్ విషయంలో ఐసీజీ విడుదల చేసిన విధానం అస్పష్టంగా, ఏకపక్షంగా ఉందని మండిపడింది. ప్రియాంక త్యాగి అనే అధికారిణికి శాశ్వత కమిషన్ ఇచ్చే అంశంపై 2 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. లేనిపక్షంలో కోర్టు స్వయంగా ఆదేశాలు జారీ చేస్తుందని వెల్లడించింది.
వార్తలు
రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలి: సుప్రీం కోర్టు


