PLD: దాచేపల్లి (మం) పొందుగులలో కౌలు రైతు బొజ్జ జానయ్య (40) బుధవారం పొలంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. మిర్చి పంటకు నీళ్లు పెడదామని పొలానికి వెళ్లి మోటార్ వేసి నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. జానయ్యకు భార్య ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
వార్తలు
విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి


