చండీగఢ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్ష బీభత్సానికి నగరంలోని ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఫుట్‌పాత్ ధ్వంసమైంది. ఫలితంగా భారీ గుంత ఏర్పడి అందులోకి వరద నీరు చేరింది. అలాగే పక్కనే విద్యుత్ స్తంభం ప్రమాదకర రీతిలో ఒరిగింది. ఈ ఘటనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
వార్తలు
వర్ష బీభత్సం.. రోడ్డుపై భారీ గుంత


