హైదరాబాద్: 28°C
వార్తలు

ఆలయ అభివృద్ధికి రూ.2 కోట్లు

ప్రకాశం: రాచర్ల (మం) జే.పీ.చెరువులోని నెమిలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థాన అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ విషయంపై ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ సచివాలయంలో బుధవారం గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.