హైదరాబాద్: 28°C
వార్తలు

ఆలయాల్లో పోస్టులు భర్తీ చేస్తాం: ఆనం

NDL: దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, ఇతర ధార్మిక సిబ్బంది నియామకాల్లో జోనల్ విధానం అమల్లో లేదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ప్రధాన దేవాలయాల్లో ఇటీవల భర్తీ చేసిన 344 పోస్టుల్లో 172 పోస్టులను రాయలసీమ ఆలయాల్లో భర్తీ చేశామని చెప్పారు. శ్రీశైలం, మహానంది ఆలయాల్లో ఖాళీలను నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని పేర్కొన్నారు.