గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సీజేపీ అధినేత అభిజీత్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పాఠశాలల అభివృద్ధి కోసం పీఎం కేర్స్ ఫండ్ నిధులను ఉపయోగించాలని సూచించారు. కూలిపోయే దశలో ఉన్న పాఠశాలలను కూల్చేసి, వాటి స్థానంలో అత్యాధునిక సౌకర్యాలతో స్కూళ్లను నిర్మించాలని కోరారు. అలాగే మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లేందుకు రోడ్లు వేయాలన్నారు.
వార్తలు
పీఎం కేర్స్ నిధులను స్కూళ్ల కోసం ఉపయోగించండి: అభిజిత్


