జమ్మూకశ్మీర్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం ఒమర్ అబ్దుల్లాతో గోర్ సమావేశమయ్యారు. అయితే, కశ్మీర్ అంశం గురించి ఒమర్ అబ్దుల్లా ఆయనతో చర్చించినట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై విమర్శలు రావడంతో ఆ వార్తలను సీఎం ఖండించారు. కశ్మీర్ సమస్యను అమెరికా ఎప్పటికీ పరిష్కరించదని వ్యాఖ్యానించారు.
వార్తలు
కశ్మీర్ సమస్యను అమెరికా పరిష్కరించదు: సీఎం


