CJP, వామపక్ష పార్టీలు చేసే నిరసనల్లో విద్యార్థులు పాల్గొనకుండా తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు, యువత.. సీజేపీ, వామపక్ష పార్టీల నిరసనల్లో పాల్గొనకుండా చూడాలని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాళ్లకు కళాశాల విద్యాకమిషనర్ ఉత్తర్వులు పంపారు. వీటిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవ్వడంతో విజయ్ సర్కార్ వెనక్కి తగ్గింది. వెంటనే తమ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.
వార్తలు
నిరసనలపై విజయ్ ఆదేశాలు.. అంతలోనే యూటర్న్


