హైదరాబాద్: 28°C
వార్తలు

ఐఫోన్ కోసం తాతను చంపించిన బాలిక

కేరళ ఆలప్పుళలో దారుణం జరిగింది. ఐఫోన్, ఖరీదైన బైక్ కోసం 13 ఏళ్ల బాలిక సొంత తాతనే దారుణంగా హత్య చేయించింది. తన మైనర్ స్నేహితులతో కలిసి హత్యకు పక్కా ప్లాన్ చేసింది. ఇంట్లో తాత ఒంటరిగా ఉన్న విషయాన్ని స్నేహితులతో చెప్పగా.. వారు దొంగతనంగా ఇంట్లోకి దూరి తాతను కట్టేసి చంపేశారు. అనంతరం ఇంట్లోని 4.5 తులాల బంగారంతో హంతకులు పరారయ్యారు. ఈ హత్యను బాలిక వీడియో కాల్ ద్వారా చూడటం విశేషం.