హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.13,041 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. గుమ్మడిపుండి-గూడూరు మధ్య రూ.2,229 కోట్లతో 3-4 లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖరగ్‌పూర్-భద్రక్ మధ్య నాలుగో లైన్ నిర్మాణానికి, భద్రక్-హరిదాస్‌పూర్ మధ్య నాలుగో లైన్ నిర్మాణానికి, కటక్, పారాదీప్ మధ్య రూ.2,286 కోట్లతో 3,4 లైన్ల నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది.