హైదరాబాద్: 28°C
వార్తలు

36 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

పాఠశాలలో వడ్డించిన మిడ్ డే మీల్‌లో జరిగిన చిన్న పొరపాటు కారణంగా 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన బీహార్ నలంద జిల్లాలో జరిగింది. ఆహారంలో ఉప్పు సరిగా లేదని విద్యార్థులు చెప్పడంతో వంటగదిలో నుంచి సాల్టుకు బదులు పొరపాటు డిటర్జెంట్ తీసుకుని ఆహారంలో కలిపారు. భోజనం తినడంతో వారికి తల తరిగడం, వాంతులు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.