హైదరాబాద్: 28°C
వార్తలు

ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో తేజస్వీ యాదవ్

నీట్‌ పేపర్‌ లీక్‌కు వ్యతిరేకంగా ఇటీవల జరిగిన ఆందోళనల సమయంలో ఓ పోలీసు ఏకే-47 తుపాకీతో కన్పించడం వివాదాస్పదమైంది. దీనిపై బీహార్ ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ తాజాగా RJD నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులపైకి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఆర్జేడీ నేత తేజస్వీని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.