NEET పరీక్షల వ్యవస్థను అత్యంత పకడ్బందీగా మార్చామని కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఇందులో భాగంగా ప్రశ్నపత్రాలను తరలించే వాహనాల కదలికలు ఎప్పటికప్పుడు తెలిసేలా GPS అమర్చినట్లు తెలిపింది. అలాగే, ఎంతో మంది నిపుణులతో క్వశ్చన్ బ్యాంక్‌లు తయారు చేయిస్తున్నామని, అయితే ఏ ప్రశ్న పరీక్షలో వస్తుందో ఆ నిపుణులకూ తెలియదని సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది.
వార్తలు
పకడ్బందీగా నీట్ పరీక్షలు: కేంద్రం


