హైదరాబాద్: 28°C
వార్తలు

గేదెలా మారి గడ్డి తిన్న వృద్ధుడు

మనిషి గేదెలా మారడం ఎప్పుడైనా చూశారా? యూపీలోని మహారాజ్‌ గంజ్ జిల్లా శివనాథ్ గ్రామంలో ఇదే ఆనవాయితీ. మూడేళ్లకోసారి జరిగే ఈ ఆచారంలో 70 ఏళ్ల బుద్ధిరామ్ అనే వృద్ధుడికి పూనకం వస్తుంది. పశువుల తొట్టిలో నోరుపెట్టి పచ్చిగడ్డి, తవుడు తింటూ గేదెలా అరుస్తాడట. ఆ సమయంలో మహిషాసురుడు ఆయనలోకి వస్తాడని, అప్పుడు మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.