హైదరాబాద్: 28°C
వార్తలు

గుంటూరులో ఐటీ అధికారుల సోదాలు

AP: గుంటూరు అరండల్‌పేటలోని CA దామ సుబ్రహ్మణ్యం నివాసంలో 2 రోజులుగా IT అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ, HYD నుంచి వచ్చిన బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి. హార్డ్‌డిస్కులు, కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రముఖ కంపెనీ ఆర్థిక వ్యవహారాలపై ప్రధానంగా విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఆ కంపెనీ యజమానిని సైతం అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.