TG: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన తనపై మరింత బాధ్యత పెంచిందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మంత్రి, తాను పార్టీ లైన్‌కు కట్టుబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. కొండా సుస్మిత వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. పరకాల సభకు మంత్రి కొండా సురేఖను ఆహ్వానించినట్లు చెప్పారు. అయితే ఆమె సభకు రాకపోవడానికి గల కారణాలు తనకు తెలియవని ఆయన వెల్లడించారు.
వార్తలు
పార్టీ లైన్‌కు కట్టుబడి పనిచేస్తాం: రేవూరి


