హైదరాబాద్: 28°C
వార్తలు

భారతీయురాలిని పెళ్లాడిన స్కాట్లాండ్‌ ఎంపీ

స్కాట్లాండ్‌లో నేషనల్ పార్టీకి చెందిన ఎంపీ మార్టిన్ డే ఓ భారతీయ యువతిని వివాహం చేసుకున్నారు. కేరళలోని గురువాయర్‌కు చెందిన నిధిన్ చాంద్ అనే యువతితో ఆయన ఏడడుగులు నడిచారు. కేరళలో బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఓ విదేశీ ఎంపీ స్వయంగా కేరళకు వచ్చి ఇక్కడి యువతిని పెళ్లాడటంతో ఈ వార్త ఇప్పుడు నెట్టింట ఆసక్తికరంగా మారింది.