ఉత్తరాఖండ్‌లో భారీ ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. కైలాస మానస సరోవర్ యాత్రకు అత్యంత కీలకమైన మార్గంలో ఉన్న కూలాగఢ్ వంతెన కుప్పకూలింది. ఈ ప్రాంతంలో ఇవాళ అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. వంతెన పూర్తిగా ధ్వంసం కావడంతో ఆ మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో యాత్రికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వార్తలు
మానస సరోవర్ యాత్ర మార్గంలో ప్రమాదం


