హైదరాబాద్: 28°C
వార్తలు

వైద్య విద్యకు తమిళనాడు ప్రభుత్వం పెద్దపీట

తమిళనాడు రాష్ట్రంలో వైద్య, నర్సింగ్ విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల సామర్థ్యాన్ని పెంచేందుకు ఏకంగా రూ.351 కోట్లు కేటాయించింది. దీని ద్వారా నర్సింగ్, పారామెడికల్, మెడికల్ కోర్సుల్లో కొత్తగా 6,098 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో కొత్తగా ఏడు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నారు.