తమిళనాడు ప్రభుత్వం పాడి రైతులకు శుభవార్త చెప్పింది. పాల సేకరణ ధరను లీటరుకు రూ.38 నుంచి రూ.41కి పెంచుతున్నట్లు ప్రకటించింది. అదనంగా ఇచ్చే ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని రూ.3 నుంచి రూ.5కు పెంచింది. ఈ నిర్ణయం వల్ల 3.16 లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకుగానూ ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.360 కోట్ల అదనపు భారం పడనుందని అసెంబ్లీలో వెల్లడించింది.
వార్తలు
పాడి రైతులకు విజయ్ సర్కార్ తీపికబురు


