TG: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ నర్సంపేటలో బంద్ కొనసాగుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విగ్రహాన్ని తొలగించడంతో పాటు బీఆర్‌ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేశారని నాయకులు ఆరోపించారు. బంద్‌కు మద్దతుగా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
వార్తలు
నర్సంపేట బంద్


