హైదరాబాద్: 28°C
వార్తలు

లోయలో పడిన కారు.. ముగ్గురు మృతి

జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి పనాసా గ్రామం వద్ద థానోల్ నుంచి థుబ్‌ వెళ్తున్న ఓ కారు మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ప్రేమ్ సింగ్(50), భార్య తూరి దేవి(45), అత్త దుర్గి దేవి(70) దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సహాయక సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు.