హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వానికి ఏపీ లైబ్రేరియన్ల విజ్ఞప్తి

AP: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు తమను కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లైబ్రేరియన్లు ప్రభుత్వాన్ని కోరారు. 2026 నుంచి 'ఉత్తమ లైబ్రేరియన్ అవార్డు' పేరుతో ప్రత్యేక కేటగిరీని ఏర్పాటు చేయాలన్నారు. ఉన్నత విద్యావ్యవస్థలో తమ పాత్ర కీలకమని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లైబ్రేరియన్ల తరఫున డాక్టర్ ఎం శ్రీనివాసప్రసాద్ ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు.