హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మిర్జా గాలిబ్ వీధిలోని ఓ హోటల్‌లో అర్థరాత్రి 2 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా బంగ్లాదేశ్‌కు చెందినవారిగా అధికారులు గుర్తించారు. వీరంతా వైద్య చికిత్స కోసం కోల్‌కతాకు వచ్చి, ఈ హోటల్‌లో బస చేసి మృత్యువాత పడ్డారు.