హైదరాబాద్: 28°C
వార్తలు

ఆప్ సర్కార్‌కు NHRC నోటీసులు

పంజాబ్‌లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల బడుల్లో జాతీయ జెండా ఎగురవేయకపోవడం, జాతీయ గేయాన్ని ఆలపించకపోవడంపై సీరియస్ అయ్యింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి 4 వారాల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.