ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో ఈ భేటీని నిర్వహించనున్నారు. దేశంలో నెలకొన్న తాజా రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలు సహా పలు కీలక విధానపరమైన నిర్ణయాలపై ఈ సమావేశంలో కేంద్ర మంత్రులతో ప్రధాని చర్చించనున్నట్లు సమాచారం. ఈ కేబినెట్ భేటీలో తీసుకోబోయే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వార్తలు
మోదీ అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం


