TG: రాష్ట్రంలో ఇవాళ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు 'పసుపు' రంగు హెచ్చరికలు జారీచేసింది. రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు నిన్న రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు నమోదయ్యాయి.
వార్తలు
పలు జిల్లాల్లో వర్షాలు


