హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రి పొంగులేటిపై మహేశ్వర్ రెడ్డి ఫైర్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల కోట్ల భూదందాకు తెరతీసిందని బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి పొంగులేటి 'రాబరీ మినిస్టర్‌'గా మారి ప్రజల ఆస్తులను లూటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనుమతులున్న స్థలాలను 22ఏ జాబితాలో చేర్చి, వాటిని తొలగించడానికి బిల్డర్లు, ప్రజల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.