హైదరాబాద్: 28°C
వార్తలు

ఆప్ నేత సత్యేందర్ జైన్ అరెస్ట్

ఢిల్లీ జల్‌ బోర్డు టెండర్ల అవినీతి కేసులో ఆప్‌ సీనియర్‌ నేత సత్యేందర్‌ జైన్‌ సహా ఆరుగురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మురుగునీటి శుద్ధి ప్రాజెక్టు టెండర్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు. అయితే, బీజేపీ ఆదేశాల మేరకే ఈ అరెస్టు జరిగిందని, ఇది బూటకపు కేసు అని ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా ఆరోపించారు.