ఢిల్లీ పోలీసులను ప్రశంసించాలంటూ కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తీవ్రంగా తప్పుబట్టారు. 'పార్లమెంటు సమీపంలో శాంతియుతంగా ఉన్న విద్యార్థులపై పెల్లెట్ గన్‌లతో పోలీసులు కాల్పులు జరిపారు. మేకులతో కూడిన లాఠీలతో కొట్టారు. ఈ క్రూరత్వాన్ని ప్రశంసించాలా? దేశ యువతకు అబద్ధాలు చెప్పకండి. వారికి కళ్లతోపాటు జ్ఞాపకశక్తి ఉంది' అని విమర్శించారు.
వార్తలు
పోలీసుల క్రూరత్వాన్ని ప్రశంసించాలా?: రాహుల్


