హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఉత్కంఠభరిత రెస్క్యూ ఆపరేషన్

ఉత్తరాఖండ్‌లోనదిలో పడిపోయిన వ్యక్తులను SDRF సిబ్బంది కాపాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రిషికేశ్‌లోని చీలా బ్యారేజ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్ అకస్మాత్తుగా అదుపుతప్పి బీన్ నదిలో పడిపోయింది. సమాచారం అందుకున్న SDRF సిబ్బంది అక్కడికి చేరుకుని ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలో తాళ్ల సాయంతో వారిని రక్షించారు. దీంతో సిబ్బందిని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.