మరణశిక్ష అమలులో ఉరితీయడానికి బదులు ప్రాణాంతక ఇంజెక్షన్ వాడాలని చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మరణశిక్షను అమలు చేసే పద్ధతిగా ప్రస్తుతానికి ఉరితీయడమే కొనసాగుతుందని వెల్లడించింది. దోషికి తక్కువ నొప్పి కలిగించే, వారి గౌరవాన్ని కాపాడే విధంగా ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
వార్తలు
మరణశిక్ష పద్ధతిపై పిటిషన్‌కు సుప్రీం నో


