హైదరాబాద్: 28°C
వార్తలు

'విద్యార్థులు విలువలను పాటించాలి'

CTR: విద్యార్థులు నైతిక విలువలు కలిగి ఉండాలని రిటైర్డ్ టీచర్ జయరామిరెడ్డి సూచించారు. సదుం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు నైతిక, మానవ విలువలపై మంగళవారం ఆయన అవగాహన కల్పించారు. విలువలను పాటిస్తే జీవిత అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ వెంకటనాథరెడ్డి, లెక్చరర్లు పాల్గొన్నారు.