హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షాలు.. 13 మంది మృతి

ఒడిశాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా తాజాగా ఐదుగురు మృతి చెందారు. వీరితో కలిపి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 13కి చేరింది. వరదల కారణంగా ఆరు జిల్లాల్లోని 1,300 గ్రామాలకు చెందిన 7.85 లక్షల మందికి పైగా ప్రభావితమయ్యారు. ఆయా ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు.