హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం సమక్షంలో 46 మంది తీవ్రవాదులు లొంగుబాటు

మణిపూర్‌లో శాంతిభద్రతల పునరుద్ధరణ దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ కంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ విభాగానికి చెందిన 46 మంది సాయుధ కేడర్లు సీఎం ఖేమ్ చంద్ సమక్షంలో లొంగిపోయారు. వీరిలో మహిళా కేడర్లు కూడా ఉన్నారు. వారు తమ ఏకే-సిరీస్ తుపాకులు, ఇన్సాస్, కార్బైన్లు, పిస్టల్స్‌తో పాటు భారీగా మందుగుండు సామగ్రిని అప్పగించారు.