హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీ ఆందోళనల్లో 2,873 పాత నేరస్తులు

జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో ఫేస్ కెమెరాల ద్వారా పాత నేరచరిత్ర కలిగిన 2,873 మందిని గుర్తించామని సుప్రీంకోర్టుకు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వీరిలో 92 మందిపై 10 కంటే ఎక్కువ నేర కేసులు ఉన్నాయని చెప్పారు. మరో 47 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే హత్య, అత్యాచారం, పోక్సో, దోపిడీ వంటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న 2,873 మందిపైనే సిట్ విచారణ జరుపుతుందని వెల్లడించారు.